Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కావాల్సినంత కామెడీతో మరో ప్రేమకథా చిత్రం

  • గతంలో హిట్ ఇచ్చిన దర్శకుడు
  • మరో ప్రేమకథతో రంగంలోకి 
  • హీరోగా రాజ్ తరుణ్  
తెలుగులో వచ్చిన విభిన్నమైన ప్రేమకథా చిత్రాలలో 'గుండెజారి గల్లంతయ్యిందే' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాతో దర్శకుడిగా కొండా విజయ్ కుమార్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో లవ్ తో పాటు కలిసి కామెడీని నడిపించిన తీరుకి ప్రశంసలు దక్కాయి. అందువల్లనే ఆయన మళ్లీ అదే తరహాలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

 'గుండెజారి గల్లంతయ్యిందే' మాదిరిగానే తాజా చిత్రంలోను మిస్ అండర్ స్టాండింగులో నుంచి పుట్టే కామెడీ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ ను హీరోగా తీసుకున్నారు. తనకంటే వయసులో పెద్దదైన యువతి ప్రేమలో హీరో ఎలా పడతాడు? ఆ తరువాత చోటుచేసుకునే గమ్మత్తయిన సన్నివేశాలేవిటి? అనే మలుపులతో ఈ కథ కొనసాగుతుందట. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించే ఈ సినిమాను వచ్చేనెలలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. 
Raj Tarun

More Telugu News